📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonఅర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి

అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

*అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి*

*రాజకీయ పార్టీల ప్రతినిధులు పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి*

*పాత జాబితాలో పేరు ఉన్నా కొత్తగా నిర్దేశిత విధానంలో దరఖాస్తు తప్పనిసరి*

*ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి*

*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*

జనగామ జిల్లా ప్రతినిధి (జె. ఉపేందర్) అక్టోబర్ 03(ప్రజావాణి: అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

శనివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పట్టభద్రులైన ఓటర్లు ఓటరుగా నమోదు చేసుకోవడంపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం వెలువరించిన నియమ నిబంధనలు, దరఖాస్తు చేసే విధానం, గడువు, తదితర వివరాలను కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల ప్రతినిధులు పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, అర్హులైన పట్టభద్రులు నిర్ణీత గడువులోగా ఫారం-18 దరఖాస్తులు సమర్పించేలా సహకరించాలని తెలిపారు.

ఓటరు జాబితాల తయారీ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

01-11-2026 నాటికి కనీసం 3 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన అర్హత కలిగిన అభ్యర్థులు Form-18 దరఖాస్తును AEROలకు (లేదా) నియమిత అధికారికి సమర్పించాలన్నారు.

దరఖాస్తుతో పాటు విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, అవసరమైన ఇతర పత్రాలను జత చేయాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్ [https://ceotelangana.nic.in/]ను సందర్శించవచ్చని తెలిపారు.

పట్టభద్రుల ఓటరు జాబితాల నూతన తయారీ ప్రక్రియలో భాగంగా, ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు సైతం నిర్దేశిత విధానం ప్రకారం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పాత ఓటరు జాబితాలో పేరు ఉండటం ఒక్కటే ప్రస్తుత ప్రక్రియలో నమోదుకు సరిపోదని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఉడుత రవి యాదవ్, భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి రావెల రవి, బీజేపీ పార్టీ ప్రతినిధి బి. జగదీష్, సీపీఎం పార్టీ ప్రతినిధి జోగు ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.