📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonకొమ్మూరి ప్రశాంత్ రెడ్డికి ఘన సన్మానం - జనగామ కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షల వెల్లువ

కొమ్మూరి ప్రశాంత్ రెడ్డికి ఘన సన్మానం – జనగామ కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షల వెల్లువ

📰 Generate e-Paper Clip

*కొమ్మూరి ప్రశాంత్ రెడ్డికి ఘన సన్మానం – జనగామ కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షల వెల్లువ*

*చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకం – యువ నాయకుడికి అభినందనలు*

జనగామ ప్రతినిధి (జె. ఉపేందర్), అక్టోబర్ 03(ప్రజావాణి): జనగామ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడు, యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా జనగామ కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం హైదరాబాద్ లోని వారి నివాసంలో జనగామ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి, పూలమాలలు వేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
యువ నాయకుడు, విద్యావంతుడు, రైతు బిడ్డ అయిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి కి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కడం నిజంగా అభినందనీయమని, ఆయన తండ్రి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని ఆకాంక్షించారు.

చేర్యాల మార్కెట్ యార్డ్ ను అన్ని హంగులతో అభివృద్ధి చేసి, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా, దళారుల దోపిడీ లేకుండా చర్యలు తీసుకుంటారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రాధాన్యతను మరింత ముందుకు తీసుకెళ్తారని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందించాలని కోరారు.

ఈ సన్మాన కార్యక్రమంలో
జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి లింగాల నర్సిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు గౌడ్, ఏఎంసి డైరెక్టర్ నామాల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు శివరాత్రి కుమార్, మినలపురం శ్రీకాంత్, పెద్ద రాంచర్ల ఇంచార్జి సర్పంచ్ కాలకుంట్ల శ్యామ్, పెంబర్తి ఉప సర్పంచ్ కొండబోయిన రాజు యాదవ్, జనగామ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మచ్చ కుమార్, నాయకులు అంబాల రఘు, శ్రీ కందాల చంద్రశేఖర్, శ్రీ బైరగోని రఘు, దాసరి సతీష్, యశ్వంత్ పూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బోట్ల హరీష్, రాజు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.