📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశంకర్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

శంకర్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

శంకర్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి..

తరచు ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు

సిద్దిపేట,అక్టోబర్ 4 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శంకర్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇతనాయిల్ ఫ్యాక్టరీకి లోడ్ తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృతుల పూర్తి వివరాలు, ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్ వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు

శంకర్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు గత సెప్టెంబర్ 24న, అక్టోబర్ 1న జిల్లా రవాణా అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమస్యపై డీటీవోను ఫోన్‌లో సంప్రదించగా ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌స్పెక్టర్‌ను పంపించి పరిస్థితిని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.అయితే ఈ ప్రాంతంలో గతంలోనూ పలువురు ప్రాణాలు కోల్పోయారని, తాజాగా మరో ఇద్దరు మృత్యువాత పడటంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇతనాయిల్ ఫ్యాక్టరీకి సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ఫ్యాక్టరీకి వచ్చే వాహనాలను రహదారిపైనే నిలిపివేస్తున్నారని, దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతో పాటు ప్రమాదాల ముప్పు పెరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఫ్యాక్టరీ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించడంతో పాటు శంకర్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద రహదారి భద్రతా చర్యలు చేపట్టాలని,వాహనదారులు గ్రామస్తులు కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.