📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ లో సర్పంచ్‌ కు సమాచారం కరువు!

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ లో సర్పంచ్‌ కు సమాచారం కరువు!

📰 Generate e-Paper Clip

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో సర్పంచ్‌కు సమాచారం కరువు!

ఆర్డీవోకు ఫిర్యాదు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి..

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం గుండ్రపల్లి గ్రామపంచాయతీ పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడంపై వివాదం నెలకొంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ ఉజ్జిని ఉషా అనిల్ రావు గురువారం చండూరు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గ్రామంలో స్థానిక రాజకీయ నాయకులు, రేషన్ డీలర్‌తో కలిసి అధికారులు నిర్వహిస్తున్నారు, అయితే తనతో పాటు ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సర్పంచ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శికి సైతం ఈ కార్యక్రమం గురించి తెలియదని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేయడానికి, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం పాటించాలని సర్పంచ్ లెక్కలు. సంబంధిత అధికారిక ఉత్తర్వులు, మార్గదర్శకాలను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే సంబంధిత జీపీఓ, అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామపంచాయతీతో సమన్వయం చేసుకుంటూ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది, విచారణ వివరాలను లిఖితపూర్వకంగా అందించాలని ఆర్వోను సూచిస్తున్నారు. తక్షణమే స్పందించిన చండూరు ఆర్డీవో వందనపు శ్రీదేవి జిపిఓకు మెమో జారీ చేయాలని తాసిల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, గుండ్రపల్లి సర్పంచ్ ఉజ్జిని ఉష, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు, బిఆర్‌ఎస్ చండూరు మండల ఉపాధ్యక్షులు కూరపాటి సుదర్శన్, అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, చండూరు మండల యువజన అధ్యక్షులు ఉజ్జిని అనిల్ రావు, చండూరు మాజీ కౌన్సిలర్ రాలెంక శేఖర్, అనపర్తి శేఖర్ ఉపసర్పంచ్ టేకుల వినోద్ రెడ్డి, వార్డు మెంబర్లు పెండ్యాల నిర్మల్ రావు, తీగల వెంకన్న, వడ్డమల్ల మధు, కాశమల్ల శ్రీనివాసరావు కాశమల్ల అనిల్ ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.