📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonగ్రామాభివృద్ధికి గ్రామ మ్యాప్ దోహదం - సర్పంచ్ రామకృష్ణ

గ్రామాభివృద్ధికి గ్రామ మ్యాప్ దోహదం – సర్పంచ్ రామకృష్ణ

📰 Generate e-Paper Clip

*గ్రామాభివృద్ధికి గ్రామ మ్యాప్ దోహదం – సర్పంచ్ రామకృష్ణ*

జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 (ప్రజావాణి):
జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ పటము (Village Map) పై అవగాహన సదస్సు నిర్వహించారు.

రాబోయే రోజుల్లో ఎల్-నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వీబీ-జీ రామ్ జీ (VB-G RAM G) పథకం ద్వారా గ్రామ మ్యాప్ ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మాట్లాడుతూ… గ్రామంలోని కుంటలు, చెరువులు, వ్యవసాయ భూములు, ఇళ్లు తదితర వివరాలన్నీ ఈ మ్యాప్ ద్వారా స్పష్టంగా తెలుస్తాయని, గ్రామాభివృద్ధి ప్రణాళికకు ఇది ఎంతో దోహదపడుతుందని అన్నారు.

అలాగే గ్రామంలో ఇప్పటికే ఊట కుంటలు ఏర్పాటు చేసుకున్న రైతుల అనుభవాలను పంచుకుంటూ, కొత్తగా ఊట కుంటలు ఏర్పాటు చేసుకునే విధానం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. నీటి సంరక్షణకు ప్రతి రైతు ఊట కుంటలు తవ్వుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివశంకర్ రెడ్డి, ఉప సర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి అనిల్ రాజ్, వార్డు మెంబర్లు కొయ్యడ అనిల్ గౌడ్, వేల్పుల శోభారాణి, బొజ్జం సునీత ప్రభాకర్, నల్ల అజయ్, నల్ల విల్సన్, బండారి మమత అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ నల్ల శ్రీనివాస్, గ్రామ రైతులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.