📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత

వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత

📰 Generate e-Paper Clip

*వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*

జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01(ప్రజావాణి):
వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్ షాలోమ్ తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, వృద్ధుల పట్ల గౌరవం, బాధ్యత పెంపొందించడం, వారికి ఉన్న సంక్షేమ పథకాలు, చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ లక్ష్యమని అన్నారు.

వైద్య రంగ అభివృద్ధితో సగటు ఆయుష్షు పెరుగుతోందని, 60 ఏళ్ల తర్వాత కూడా మరో 20 ఏళ్లు జీవించే అవకాశం ఉందని, కాబట్టి వారి ఆరోగ్యం, ఆర్థిక భద్రత, సామాజిక గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల నైతిక బాధ్యత అని, వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రులు, వృద్ధ పౌరుల పోషణ, సంక్షేమ చట్టం-2007 ను అమలు చేస్తోందని తెలిపారు. పిల్లలు పట్టించుకోకపోతే నిర్వహణ భృతి పొందే హక్కు, ఆస్తి బదలాయింపును సెక్షన్ 23 ప్రకారం రద్దు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వృద్ధులకు పింఛన్ ఇస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోందని, జిల్లా కేంద్రంలోని ప్రణామ్ కేంద్రాలు వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, వృద్ధులు ఏదైనా సమస్య ఉంటే 14567 టోల్ ఫ్రీ నంబర్ (ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు) ను వినియోగించుకోవాలని సూచించారు.

అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ మాట్లాడుతూ… ప్రస్తుతం సమాజంలో 10% వృద్ధులు ఉన్నారని, 20 ఏళ్లలో ఇది 25% కి పెరిగే అవకాశం ఉందని, అటల్ వయో అభ్యుదయ యోజన కింద మల్టీ డే కేర్ సెంటర్లు, ప్రణామ్ డే కేర్ సెంటర్ల ద్వారా రోజూ 50-60 మంది వృద్ధులకు సేవలు అందిస్తున్నామని, 70 ఏళ్లు దాటిన వారికి వందన స్కీం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

అనంతరం వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ భాస్కర్, డిఎమ్ఎచ్ఓ వాణిశ్రీ, కన్సల్టెంట్ మైత్రేయి, డిఎం ఆర్టీసీ ఉషా, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మమత, ఏపీడీ నూరుద్దీన్, డీపీఎం నళిని, జ్యోతి, ఇతర అధికారులు, సిబ్బంది, జిల్లాలోని వివిధ మండలాల వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.