*నెల్లుట్ల బంధం కుంటకు గోదావరి నీరు – గంగమ్మకు పూజలు*
జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 (ప్రజావాణి):
జిల్లా లోని లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో వరి పంటలు ఎండిపోతున్నాయని, బతుకమ్మ పండుగ వేళ మహిళలకు నీటి ఇబ్బందులు ఉన్నాయని గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ, రైతులు, గ్రామస్తులు తమ దృష్టికి తీసుకురావడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి , స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తక్షణమే స్పందించారు.
తన ప్రత్యేక చొరవతో సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి, గోదావరి నీటిని నెల్లుట్ల గ్రామంలోని బంధం కుంటకు మళ్లించి నింపించడం జరిగింది. దీంతో కుంట పూర్తిగా జలకళను సంతరించుకుంది. వరి పంటలకు సాగునీరు అందడంతో పాటు, పశువులకు, బతుకమ్మ పండుగకు నీటి కొరత తీరడంతో రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కుంట వద్ద గంగమ్మ తల్లికి గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి అనిల్ రాజ్, వార్డు మెంబర్లు కొయ్యడ అనిల్, వేల్పుల శోభారాణి, గొరిగే సందీప్, కత్తి శ్రీవాణి, బొజ్జం సునీత ప్రభాకర్, నల్ల అజయ్, విల్సన్, వంగ సతీష్, బండారి మమత అశోక్, బత్తిని వేణు, తాండ్ర భరత్, గ్రామశాఖ అధ్యక్షులు మాచర్ల మహేందర్, పాక్స్ డైరెక్టర్ గుర్రం బాలరాజు, వీడీసీ చైర్మన్ బత్తిని అశోక్, జిల్లా కమిటీ సభ్యులు దామెర నాగరాజు, మండల ఎస్సి సెల్ అధ్యక్షులు నర్సింగ రమేష్, మాజీ ఎంపీటీసీ లు గాడిపెల్లి శ్రీనివాస్, మోటే వీరస్వామి, మాజీ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల అధ్యక్షులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు, మహిళలు, గ్రామస్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

