📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరొయ్యూరు పంచాయతీలో 24 లక్షల నిధుల గోల్ మాల్

రొయ్యూరు పంచాయతీలో 24 లక్షల నిధుల గోల్ మాల్

📰 Generate e-Paper Clip

రొయ్యూరు పంచాయతీలో 24 లక్షల నిధుల గోల్ మాల్
. ఆరో వార్డు మెంబర్ సరస్వతి సంచలన ఆరోపణ
రొయ్యూరులో 12 చెక్కులు ఒకే వ్యక్తి పేరు మీద!
10 వేలకు అమ్ముడుపోయిన వార్డు మెంబర్లు? రొయ్యూరు ఆడియో కాల్ వైరల్
.సురవీడులో సస్పెండ్.. రొయ్యూరులో మౌనం ఎందుకు? మంత్రి సీతక్క ఇలాకాలో చర్చ.

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామపంచాయతీలో 24 లక్షల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరవ వార్డు మెంబర్ సరస్వతి సంచలన ఆరోపణలు చేశారు.
దీనిపై ప్రజావాణి కార్యక్రమంలో ఆరుగురు వార్డు మెంబర్లు లిఖితపూర్వకంగా సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్, డీపీఓ ను విచారణ జరపాలని ఆదేశించారు.
డీపీఓ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ఎంపీడీఓ షాజహాన్ రొయ్యూరు గ్రామపంచాయతీకి చేరుకుని విచారణ ప్రారంభించారు.గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్, కార్యదర్శిని వివరణ కోరగా, రికార్డులు అందుబాటులో లేవని, ఒకరోజు గడువు కావాలని వారు కోరారు.ఎంపీడీఓ ఒకరోజు గడువు ఇచ్చి వెళ్లగా, ఈరోజు మళ్లీ పంచాయతీకి చేరుకుని రికార్డులను స్వాధీనం చేసుకుని విచారించారు.ఈ నిధుల దుర్వినియోగంలో కార్యదర్శి సొంత గ్రామానికి చెందిన బి. నరేందర్ అనే వ్యక్తి పేరు మీద ఏకంగా 12 చెక్కులు ఎలా మంజూరు చేస్తారంటూ గ్రామస్తులు మండిపడ్డారు.ఎంబి రికార్డులలో సైతం అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు.నివేదికను ఉన్నతాధికారులకు పంపించి చర్యలు చేపడతామని ఎంపీడీఓ తెలిపారు.అయితే కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆరుగురు వార్డు మెంబర్లలో ఐదుగురిని సర్పంచ్ ఒక్కొక్కరికి పదివేలు ఇచ్చి, ఒకేసారి 9 సంతకాలు చేయించుకుని తనవైపు తిప్పుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఇందుకు నిదర్శనంగా ఒక వార్డు మెంబర్ సర్పంచ్ దగ్గర 10 వేలు తీసుకుని సంతకాలు చేశామంటూ మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మొన్న వెంకటాపురం మండలం సురవీడు పంచాయతీలో నిధుల దుర్వినియోగం నిరూపణ కావడంతో సర్పంచ్, ఉప సర్పంచ్ లను ఆరు నెలలపాటు సస్పెండ్ చేశారు.అలాంటిది రొయ్యూరులో ఆరోపణలు వచ్చినా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని గ్రామాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
మంత్రి సీతక్క ఇలాకాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ పై ఇంత చర్చ జరుగుతున్నా, సరైన విచారణ జరపకుండా ఒకరోజు గడువు ఇవ్వడంపై పలువురు మండిపడుతున్నారు.
పంచాయతీ నిధులను సొంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసిన సర్పంచ్, కార్యదర్శిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.