📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఫారెస్ట్ ట్రైల్ రన్ పోస్టర్ ఆవిష్కరణ

ఫారెస్ట్ ట్రైల్ రన్ పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

ఫారెస్ట్ ట్రైల్ రన్ పోస్టర్ ఆవిష్కరణ

*మన ప్రజావాణి*
మందమర్రి అక్టోబర్ 1
ఈ నెల 11వ తేదీ ఆదివారం మంచిర్యాల ఎసీసీ క్వారీలో గ్రీన్ సీక్యూర్ ఫౌండేషన్, జిల్లా అటవీ శాఖ సంయుక్తంగా నిర్వహించనున్న ఫారెస్ట్ ట్రైల్ రన్ కు మద్దతుగా మందమర్రి రన్నర్స్ ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు
మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజలింగు పోస్టర్‌ను ఆవిష్కరించారు
ఈ సందర్భంగా కమిషనర్ రాజలింగు మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలో తొలిసారిగా ప్రకృతిలో నిర్వహించనున్న రన్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు. ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాలంటే రన్నింగ్, వాకింగ్, వ్యాయామం తప్పనిసరి అని అన్నారు అనంతరం వాకర్స్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుమాట్లాడుతూ.. నిత్య జీవితంలో పరుగు (రన్నింగ్) ఒక భాగంగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఫారెస్ట్ ట్రైల్ రన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం మందమర్రి రన్నర్స్ సభ్యులు గుడికందుల రమేష్, ముడారపు అనిల్, రామంచ తిరుపతి మాట్లాడుతూ.. గ్రీన్ సీక్యూర్ ఫౌండేషన్ చేపట్టిన ఫారెస్ట్ ట్రైల్ రన్‌కు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మున్ముందు జరిగే మారథాన్‌లకు సంబంధించిన వివరాలను మందమర్రి రన్నర్స్ ద్వారా అందించి, ప్రతి ఒక్కరూ రన్నింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహిస్తామని అన్నారు
త్వరలో మందమర్రి పట్టణంలో మందమర్రి రన్నర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ నెల 11న మంచిర్యాలలో జరిగే ఫారెస్ట్ ట్రైల్ రన్‌కు సంబంధించిన వివరాల కోసం 8977779985 నంబర్‌లో సంప్రదించాలని వారు కోరారుఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు, మందమర్రి రన్నర్స్ సభ్యులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.