కూటిగల్ లో అప్పుల బాధతో యువ రైతు ఆత్మ హత్య
మద్దూరు అక్టోబర్1, ప్రజా వాణి,
అప్పుల బాధ తాలలేక యువ రైతు ఇంట్లో ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది…. వివరాల్లోకి వెళ్తే మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన దాసరం సుధాకర్(40) అనే యువ రైతు అప్పులు చేసి తన సొంత భూమిలో పత్తి పంట సాగు చేశాడు. వర్షబావ పరిస్థితి వల్ల నీరు లేక పంట సరిగా లేకపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై బుధవారం అర్ధ రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు గ్రామ సర్పంచ్ దాసరం బాలకృష్ణ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు,ఒక కొడుకు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చేర్యాలకు తరలించినట్లు తెలిపారు.

