ఎత్తొండ పీఏసీఎస్ సంఘాన్ని తక్షణమే పునరుద్ధరించాలి.
రూ.100 కోట్ల టర్నోవర్ సాధించిన ఎత్తొండ సహకార సంఘం మళ్లీ తెరుచుకోవాలి.
కొత్త సోమశేఖర్ రావును అధ్యక్షుడిగా నియమించాలని ఇటీవల కాలంలో ఎత్తొండ రైతుల ఏకగ్రీవ తీర్మానం
సంఘం పూర్వ వైభవం కోసం సోమశేఖర రావును చైర్మన్‌గా నియమించాలని పోచారంకు ఐదు గ్రామాల రైతుల విజ్ఞప్తి

కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలోని ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని తక్షణమే పునరుద్ధరించా లని,గత వైభవాన్ని సంతరించుకునేలా కొత్త సోమశేఖర రావును చైర్మన్‌గా నియమించాలని కోరుతూ ఆ సంఘం పరిధిలోని ఐదు గ్రామాల రైతులు,సంఘ సభ్యులు బుధవారం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రైతులు,సంఘ సభ్యులు మాట్లాడుతూ.గతం లో ఈ సంఘం ద్వారా రైతులకు ఎరువులు,బ్యాంకింగ్ సేవలు,ధాన్యం కొనుగోలు వంటి సేవలు ఎంతో సక్రమంగా అందేవని తెలిపారు.అయితే 2018 నుండి 2023 మధ్య కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు,ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంఘం సేవలు పూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.దీనివల్ల ప్రస్తుతం రైతులు ఎరువు లు ఇతర అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.1995 నుండి 2018 వరకు కొత్త సోమశేఖర్ రావు అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కేవలం రూ.2 కోట్ల టర్నోవర్‌గా ఉన్న ఈ సంఘం సుమారు రూ.100 కోట్ల టర్నోవర్‌కు అభివృద్ధి చెందిందని వారు గుర్తుచేశారు.ఆ కాలంలో రెండు రైస్ మిల్లులు,సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, కిరాణా,జనరల్ స్టోర్స్,పెట్రోల్ బంక్ వంటి అనేక సేవలు అందుబాటులో ఉండేవని తెలిపారు.రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎత్తొండ పీఏసీఎస్‌ను పునరుద్ధరించి గతంలో అందించిన సేవలను తిరిగి ప్రారంభించాలని కోరారు. సంఘం పరిధిలోని ఐదు గ్రామాల రైతులు,సంఘ సభ్యులు ఇటీవలే సమావేశమై పీఏసీఎస్ ఎత్తొండ అధ్యక్షులుగా కొత్త సోమశేఖర రావును నియమించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు.గతంలో ఈ సంఘం అభివృద్ధికి ఎంత గానో కృషి చేసిన కొత్త సోమశేఖర్ రావును తిరిగి బాధ్యత ల్లోకి తీసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అలాగే బాన్సువాడ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డిలను వారు కోరారు.ఈ కార్యక్రమం లో రాజు దేశాయ్,కే.రత్నాకర్,చంద్రయ్య,ఈ.రాజేష్,పి. కిష్టయ్య,దాదు,ఎస్.శంకర్,సాయిలు,ఎస్.కే. మునవర్,రంగా గౌడ్,బీ.లక్ష్మణ్,ఎస్.నాగయ్య,ఎం.లక్ష్మణ్,పి.సాయిలు, బీ.హనుమంతు,హెచ్.గంగారం,బి.లాలయ్య,ఎం.గంగారం తదితరులు పాల్గొన్నారు.

