ఆపదలో అండగా ఫ్రెండ్లీ కేర్
జర్నలిస్ట్ ఐలయ్య కుటుంబానికి ₹10,500 ఆర్థిక సాయం – 25 కిలోల బియ్యం అందజేత
ముగ్గురు పిల్లలకు 5వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తామని డా. పెదపూడి ప్రసన్న కుమార్ హామీ
పెద్దవంగర సెప్టెంబర్ 27 ప్రజావాణి. .గంట్లకుంట గ్రామానికి చెందిన జర్నలిస్ట్ కీ.శే. చింతల ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఆయన కుటుంబ పరిస్థితిని నమస్తే తెలంగాణ రిపోర్టర్ కొండ. సతీష్ ద్వారా తెలుసుకున్న ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. పెదపూడి ప్రసన్న కుమార్ వెంటనే స్పందించారు.
ఐలయ్య మృతి విషయాన్ని ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులకు తెలియజేయగా, సభ్యులు మానవతా దృక్పథంతో వెంటనే స్పందించారు. ఫోన్‌పే ద్వారా తమకు తోచిన విధంగా విరాళాలు అందించి మొత్తం రూ.10,500 సమకూర్చారు. ఈ మొత్తాన్ని ఐలయ్య కుటుంబానికి అందజేశారు.అదేవిధంగా కొడకండ్ల నవీన్ శేటు 25 కిలోల బియ్యం బస్తాను అందించి కుటుంబానికి తనవంతు సహకారం అందించారు.
ఈ సందర్భంగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులు, కొడకండ్ల చిన్నబడి ప్రధానోపాధ్యాయులు దొర్ణం ప్రభాకర్ మాట్లాడుతూ, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మై రెడీమర్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. పెదపూడి ప్రసన్న కుమార్, చింతల ఐలయ్య కుటుంబంలోని ముగ్గురు పిల్లలకు 5వ తరగతి వరకు తన పాఠశాలలో ఉచిత విద్య అందిస్తానని ప్రకటించడం అభినందనీయమని తెలిపారు.ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు పిల్లల భవిష్యత్తుకు విద్యా భరోసా కల్పించడం ఎంతో గొప్ప మానవతా కార్యక్రమమని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో మేస్త్రి అందె యాకయ్య, బోదాసు నర్సయ్య, జిలుకర అశోక్ తదితరులు పాల్గొన్నారు.

