📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణహుస్నాబాద్ లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి బెజ్జంకి సర్పంచులకు VBG-RAM-Gపై ప్రత్యేక శిక్షణ

హుస్నాబాద్ లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి బెజ్జంకి సర్పంచులకు VBG-RAM-Gపై ప్రత్యేక శిక్షణ

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్ లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి బెజ్జంకి సర్పంచులకు VBG-RAM-Gపై ప్రత్యేక శిక్షణ

గ్రామీణ ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధిపై అవగాహన

గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేలా సూచనలు

బెజ్జంకి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి)

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక వసతుల మెరుగుదలే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న వికసిత్ భారత్–గారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ్ (VBG-RAM-G)పై హుస్నాబాద్‌లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు హాజరై శిక్షణ పొందారు. ఈ యొక్క శిక్షణలో
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, గ్రామాల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టడం, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం వంటి అంశాలపై సర్పంచులకు అవగాహన కల్పించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి అమలు చేయాల్సిన తీరుపై శిక్షణలో వివరించారు.అలాగే గ్రామాల్లో ఉపాధి కల్పన, అభివృద్ధి పనుల ఎంపిక, పనుల ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం, గ్రామీణ జీవనోపాధి మెరుగుదల తదితర అంశాలపై సర్పంచులకు పలు సూచనలు చేశారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.