📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriశ్రీ సాయి యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి లడ్డూలకు వేలం పాట

శ్రీ సాయి యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి లడ్డూలకు వేలం పాట

📰 Generate e-Paper Clip

అన్నోజిగూడ, సెప్టెంబర్ 26 (ప్రజావాణి):

ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని అన్నోజిగూడ ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీలో శ్రీ సాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లడ్డూలు, పూలు, పండ్లను నైవేద్యంగా సమర్పించారు.

వినాయకుడి లడ్డూలకు నిర్వహించిన వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్ద లడ్డూను వడ్లకొండ ప్రశాంత్ రూ.56 వేలతో, చిన్న లడ్డూను వింద్రవత్ రవి రూ.43 వేలతో దక్కించుకున్నారు. అలాగే పూలు, పండ్లను నానావత్ దుర్గాప్రసాద్ రూ.30 వేలతో అందించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చేలా ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కాలనీ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.