📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజాహిత పాలన కోసం బహుజన్ ఫ్రంట్ ఏర్పాటు

ప్రజాహిత పాలన కోసం బహుజన్ ఫ్రంట్ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

ప్రజాహిత పాలన కోసం బహుజన్ ఫ్రంట్ ఏర్పాటు

వివిధ,రాజకీయ ప్రజ సంఘాల ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26.

రానున్న నగరపాలక సంస్థ ఎన్నికలలో ప్రజాహిత, పారదర్శక, అవినీతి రహిత పాలన కోసం మూడవ రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక బహుజన ఫ్రంట్ కు నేడు బహుజన నాయకుల ఆధ్వర్యంలో నాంది పలికినట్లు, పి పేరయ్య, చావలి సుధాకర్ లు తెలిపారు. శనివారం ఒంగోలులో గిరిజన్ భవన్లో జరిగిన ఎస్సీ, ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ రాజకీయ అవగాహన సదస్సులో ఏకగ్రీవ తీర్మానంతో బహుజన్ ఫ్రంట్ రాజకీయ వేదిక ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న ఏఐబిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ బి పరంజ్యోతి మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితుల దృశ్య బహుజన వర్గాలంతా ఏకమై ప్రస్తుత పాలకవర్గ ప్రతిపక్ష రాజకీయ ఆర్థిక దాస్తీకానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రానున్న మున్సిపల్ నగరపాలక సంస్థ ఎన్నికలలో ఈ బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆయా వర్గాలు ఏకమై,ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించాలని ఆయన కోరారు. రానున్న కాలంలో బహుజన్ ఫ్రంట్ రాజకీయ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతుందని తెలిపారు. జిల్లా బీసీ సమన్వయ కమిటీ గౌరవాధ్యక్షులు మరియు సీనియర్ న్యాయవాది శేఖర్ మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారం కోసం బహుజన వర్గాలన్నీ ఏకం కావాలని, జనాభాలో సగానికి పైగా ఉన్న బహుజన వర్గాలు రాజకీయ ప్రాధాన్యతకు ముందుకు సాగాలని కోరారు. ఐ ఎల్ పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం మాట్లాడుతూ డాక్టర్ బి బి ఆర్ అంబేద్కర్ రహస్యాలు కనుగొనంగా రాజకీయ ప్రాధాన్యతలను సంతరించుకోవాలని, బహుజన్ ఫ్రంట్ బాటలో నడవాలని కోరారు. ఎస్టి సంఘ నాయకులు వెట్టి చాకిరి విముక్తి సంఘం నాయకులు సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎరుకల యానాది తదితర గిరిజనులు రాజకీయ, సంక్షేమ నిర్లక్ష్యానికి గురవుతున్నారని బహుజన్ ఫ్రంట్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ తరఫున షేక్ సలార్, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు మోహన్, బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు చల్ల హరి,గాదె శేఖర్, రెడ్ స్టార్ నాయకులు బి సుబ్బారావు, బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ బొట్ల సుబ్బారావు,జిల్లా కన్వీనర్ గుంటూరు మస్తాన్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రఫీ, ముస్లిం నాయకులు,న్యాయవాది షేక్ బుజ్జి, జై భీమ్ పార్టీ నాయకులు కృష్ణ, క్రిస్టియన్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ డేనియల్, ఏఐబిఎస్పి నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ, తాటిపర్తి వెంకటస్వామి, పేరం సత్యం, ఎరుకుల హక్కుల సంఘం నాయకులు మోహన్ కుమార్ ధర్మ,గిరిజన నాయకులు షేక్ సైదా నాయక్, ఎమ్మార్పీఎస్ నాయకులు తొరటి ఆనంద్, హేతువాద సంఘం నాయకులు షేక్ బేగ్, ముదిరాజు సంఘం నాయకులు గోగుల శివుడు, దళిత సేవా సంఘం నాయకులు బాబు, మన కాలం పత్రిక ఎడిటర్ ప్రముఖ కవి కత్తి కళ్యాణ్ మరియు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.