తెలంగాణ మహిళాచాకలి ఐలమ్మ విగ్రహం వీరనారి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
* మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు రజక సంఘం అధ్యక్షులు వరగంటి సదానందం
జమ్మికుంట సెప్టెంబర్ 26 (ప్రజావాణి)
తెలంగాణ మహిళా స్ఫూర్తిదాయిని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద శనివారం వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణలో సామాజిక అసమానతలు, పెత్తందారీ దోపిడీ, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి అని కొనియాడారు. భూమి, కూలి, ఆత్మగౌరవం కోసం అణగారిన వర్గాల ప్రజలను చైతన్యపరిచిన ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి కూడా ఆదర్శమన్నారు. అప్పటి సామాజిక పరిస్థితుల్లో మహిళగా అనేక అడ్డంకులను ఎదుర్కొంటూనే అన్యాయానికి తలొగ్గకుండా పోరాటం చేయడం ఆమె ధైర్యసాహసాలకు నిదర్శనమన్నారుప్రజలపై పెత్తందారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఐలమ్మ నిలబడటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రజల్లో చైతన్యం పెరగడానికి దోహదపడిందన్నారు. తనకు ఎదురైన అన్యాయాన్ని వ్యక్తిగత సమస్యగా కాకుండా సామాన్య ప్రజల హక్కుల సమస్యగా భావించి పోరాడిన ఆమె జీవితం సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిందన్నారు. మహిళలు కూడా సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించగలరని, హక్కుల కోసం పోరాడగలరని ఐలమ్మ తన జీవితంతో చాటిచెప్పారని పేర్కొన్నారు.
ఐలమ్మ ఆశయాలను నేటి తరానికి పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ సామాజిక సమానత్వం, మహిళల ఆత్మగౌరవం, పేదల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

