📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonదొరల గడీలను గడగడలాడించిన దీరవనిత చాకలి ఐలమ్మ

దొరల గడీలను గడగడలాడించిన దీరవనిత చాకలి ఐలమ్మ

📰 Generate e-Paper Clip

దొరల గడీలను గడగడలాడించిన దీరవనిత చాకలి ఐలమ్మ

వల్లంపట్లలో ఘనంగా జయంతి వేడుకలు

మద్దూరు సెప్టెంబర్ 26, ప్రజా వాణి,

మండలంలోని వల్లంపట్ల గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి గ్రామ యువకులు,గ్రామస్థులు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ..వారు మాట్లాడుతూ
తెలంగాణ నేల ఉరిమిన ఉరుము… గర్జించిన సింహం… దొరల గడీలను గడగడలాడించిన దీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు.బానిస సంకెళ్లను తెంచిన అగ్నిశిఖ మన వీరవనిత చిట్యాల ఐలమ్మ (చాకలి ఐలమ్మ)! నేడు ఆ పోరాట స్ఫూర్తిమూర్తి 131వ జయంతి సందర్భంగా, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకకు మా యొక్క హృదయపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నమన్నారు.
చరిత్ర తిరగరాసిన వీర నారి:
పౌరుషానికి నిలువెత్తు రూపం: ఐలమ్మ కేవలం ఒక మహిళ కాదు, నైజాం నిరంకుశత్వ గుండెల్లో నిద్రపోయిన విప్లవాగ్ని! “నా నేల మీద పంట నాదే… నా హక్కును కాలరాసే ధైర్యం ఏ దొరకూ లేదు” అని దొరల, రజాకార్ల తుపాకులకు ఎదురొడ్డి నిలబడిన వీరనారి.
సాయుధ పోరాట మూలవిరాట్టు: పాలకుర్తి మట్టిలో ఐలమ్మ విసిరిన పోరాట విత్తనమే, అక్షరాలా కోటి రత్నాల తెలంగాణ సాయుధ పోరాటమై మహా వృక్షంలా మారింది. ఆంధ్రమహాసభ పిలుపుతో త్యాగానికి సిద్ధపడి, భూమి కోసం,భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడి చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసిందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు,యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.