📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకోదాడలో ఘనంగా రోశయ్య విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాట్లు

కోదాడలో ఘనంగా రోశయ్య విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

కోదాడలో ఘనంగా రోశయ్య విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాట్లు..
• త్వరలోనే ఆవిష్కరణ: వాసవి క్లబ్ నిర్వాహకులు..
• ప్రమీల టవర్ సెంటర్ వద్ద స్థల పరిశీలన..

కోదాడ పట్టణం, సెప్టెంబర్ 26/ ప్రజావాణి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోశయ్య విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాట్లను వాసవి క్లబ్ కోదాడ ప్రతినిధులు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని స్థానిక ప్రమీల టవర్ సెంటర్ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో, అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని క్లబ్ నిర్వాహకులు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య, వాసవి క్లబ్ నాయకులు మాట్లాడుతూ.. పరిపాలనాదక్షుడు, ‘ఆర్యవైశ్య రత్న’ అయిన కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని కోదాడ పట్టణ నడిబొడ్డున ప్రతిష్ఠించుకోవడం తమకు ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైశ్య ప్రముఖుల సమక్షంలో త్వరలోనే విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తామని వారు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కోదాడ అధ్యక్షులు ఓరుగంటి పాండు, కార్యదర్శి ఉప్పల అశోక్, కోశాధికారి వెంపటి ప్రసాద్, రీజియన్ చైర్మన్ వంగవీటి నాగరాజు, ఐపీసీ వంగవీటి లోకేశ్వరరావు, జిల్లా సెక్రటరీ సర్వీసెస్ జగిని ప్రసాద్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పైడిమర్రి నారాయణరావుతో పాటు పలువురు వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.