📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaడ్రై డే–ఫ్రైడేలో పారిశుధ్యంపై అవగాహన

డ్రై డే–ఫ్రైడేలో పారిశుధ్యంపై అవగాహన

📰 Generate e-Paper Clip

డ్రై డే–ఫ్రైడేలో పారిశుధ్యంపై అవగాహన

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఆశా వర్కర్ లావణ్య

తంగళ్లపల్లి, సెప్టెంబర్ 25, ప్రజావాణి: తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ‘డ్రై డే–ఫ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటి పరిసరాలను పరిశీలించి, దోమలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు నివారణ స్ప్రే పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ లావణ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, పారిశుధ్యాన్ని పాటిస్తే దోమల ద్వారా వ్యాపించే అనేక రకాల రోగాలను నివారించవచ్చని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.