అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి చింటూకు ఆర్థిక చేయూత
రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేసిన 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్
యెల్లంపేట్: యెల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో నివసిస్తున్న వడ్డే కృష్ణ, అరుణ దంపతుల కుమారుడు చింటూకు ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో, 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ వారి కుటుంబాన్ని పరామర్శించారు.
చిన్నారికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న ఆమె, వారి ఇంటికి వెళ్లి చింటూ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చింటూ కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
చిన్నారి చింటూ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అర్చన శ్రీనివాస్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని ఆ
మె తెలిపారు.

