ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా అర్చన శ్రీనివాస్
అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి చింటూకు ఆర్థిక చేయూత రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేసిన 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ యెల్లంపేట్: యెల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో నివసిస్తున్న వడ్డే కృష్ణ, అరుణ దంపతుల కుమారుడు చింటూకు ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో, 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న ఆమె, వారి ఇంటికి వెళ్లి చింటూ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు....