*చీడపీడల, తెగుళ్ల నివారణ పై అవగాహన సదస్సు*
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
గురువారం చండూరు మండలం లోని తిమ్మారెడ్డి గూడెం రైతు వేదికలో వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ), మునుగోడు డివిజన్ ఆధ్వర్యంలో రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మునుగోడు డివిజన్ ఆత్మ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ పాల్గొన్నారు. రైతులను ఉద్దేశించి ఆత్మ చైర్మన్ రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ వ్యవసాయ కార్యక్రమాలు, పంటల సాగులో పాటించాల్సిన మెళకువల పై అవగాహన కల్పించనున్నారు. అలాగే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లే దిశగా అడుగులు వేయాలి అని గో ఆధారిత వ్యవసాయం చేయాలనీ విచక్షణారహితంగా పురుగు మందుల వాడకం తగ్గించాలని రైతులకు తెలియజేయడం జరిగింది. అలాగే జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పప్పు దినుసులు మరియు పత్తి పంటల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలు ప్రధాన అంశంగా రైతులకు ముఖ్యం అని పంటలను ఆశించే వివిధ రకాల చీడపీడలు, తెగుళ్లను ముందుగానే గుర్తించడం, వాటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అవలంబించడం, అవసరానికి అనుగుణంగా మాత్రమే పురుగుమందులు వినియోగించడం, పురుగుమందుల వల్ల కలిగే నష్టాలను తగ్గించడం గురించి రైతులకు సూచించారు. అలాగే
ప్రకృతి వ్యవసాయం, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించే పద్ధతులు, నేల ఆరోగ్య పరిరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం, పర్యావరణహిత సాగు విధానాలను రైతులకు తెలియజేయడం జరిగిందని
ఉద్యాన శాఖ అధికారులు ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులకు ఉన్న అవకాశాలు, అనుకూలమైన భూములు, సాగు విధానం, మొక్కల సంరక్షణ, నీటి యాజమాన్యం, దీర్ఘకాలికంగా ఆదాయం పొందే విధానాలపై కూడా వివరించారు. అలాగే పశు పోషణ గురించి వెటర్నెరీ డాక్టర్ రైతులకు తెలియజేయడం జరిగింది. అలాగే ఫార్మర్ రిజిస్ట్రీలో ప్రతి రైతు, వారి భూముల వివరాలను నమోదు చేసుకోవాల్సిన అవసరం, భవిష్యత్తులో ప్రభుత్వ వ్యవసాయ పథకాలు మరియు రైతులకు అందే వివిధ సేవలను సులభంగా పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాధాన్యత వంటి అంశాలపై కూడా రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఆర్పీఎల్ కార్యక్రమం ద్వారా ఇప్పటికే వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్న రైతుల పూర్వ జ్ఞానం, నైపుణ్యాలను గుర్తించి, వాటిని ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయడం ద్వారా రైతుల నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు వ్యసాయ సహాయ సంచాలకులు బి వేణు గోపాల్, మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ ఉద్యాన శాఖ అధికారి విద్యా సాగర్ వెటర్నరీ డాక్టర్ రమేష్ ఆత్మ డైరెక్టర్లు, ఏఈఓ నాగార్జున నెర్మట గ్రామ సర్పంచ్ తిమ్మారెడ్డి గూడెం ఉప సర్పంచ్ గుణగోని సైదులు ఇంకా ఇతర శాఖల అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

