సామాజిక బాధ్యతతో విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపు
బెజ్జంకి, సెప్టెంబర్ 24 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 57వ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సామాజిక సేవ,బాధ్యతలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు సమాజ సేవను తమ బాధ్యతగా భావించి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని,గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు సేవ చేయాలని,సమాజ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, విద్యతో పాటు సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవడం ద్వారా బాధ్యతాయుత పౌరులుగా ఎదగవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఏ. దేవస్వామి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఏ. మురళి, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

