*మండపంలోనే మట్టి వినాయకుడి నిమజ్జనం*
* *మన ప్రజావాణి* మందమర్రి:-
శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో పట్టణ మార్కెట్ వ్యాపారస్తులు ప్రతిష్టించిన మట్టి వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వాహకులు బుధవారం మండపం వద్దనే భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు హాజరై, గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఓదెలు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి, పూజించడం ఎంతో అవసరమని తెలిపారు. మట్టి వినాయకులను ప్రోత్సహించడం వల్ల నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునన్నారు. అదేవిధంగా పట్టణ ఎస్ఐ గోపతి నరేష్ సైతం ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని, మట్టి వినాయకుడి ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు
. ఈసందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ, పర్యావరణ హితమైన మట్టి వినాయకులను ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
గణేష్ మండలి కమిటీ సభ్యులు, మార్కెట్ వ్యాపారస్తులు, భక్తులు పాల్గొన్నారు.

