📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonకరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి - మంత్రికి అడ్లూరి కి వినతి

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి – మంత్రికి అడ్లూరి కి వినతి

📰 Generate e-Paper Clip

*కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి – మంత్రికి అడ్లూరి కి వినతి*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23(ప్రజావాణి):
కరెన్సీ నోట్లపై డా. బి.ఆర్. అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డా. జేరిపోతుల పరశురామ్ తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. సెక్రటేరియట్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి ఈ డిమాండ్ ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి క్యాబినెట్ లో చర్చించి, కేంద్రానికి లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇది న్యాయమైన డిమాండ్ అని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం డా. జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ డా. అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదన్నారు. 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు “రూపాయి – దాని సమస్య పరిష్కార మార్గం” అనే పుస్తకాన్ని రాసి హిల్టాన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్ కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిందని, దానికి కారణం డా. బి.ఆర్. అంబేద్కర్ అని తెలిపారు. చరిత్రను నిర్మించిన వారి ఫోటో కరెన్సీపై ఉండాలని, ఈ డిమాండ్ సాధనకు రాజ్యసభ, పార్లమెంట్ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించిన సందర్భంగా కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద వేలాది మంది కళాకారులచే డూం డాం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం. మధు, సూరారపు పరీక్షన్, దాసరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.