*రాఘవ రెడ్డికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు*
*శాలువా కప్పి సత్కరించిన జై శ్రీరామ్ మిత్ర బృందం*
ఎల్లంపేట్ మున్సిపాలిటీ:- బీజేపీ యువమోర్చా జిల్లా నాయకులు రాఘవ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎల్లంపేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ మిత్ర బృందం సభ్యులు రాఘవ రెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాఘవ రెడ్డి యువతతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో తన వంతు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. యువతకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా రాఘవ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎల్లంపేట్ గౌరారం జగన్ గౌడ్, బీజేపీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, ప్రముఖ వ్యాపారవేత్త హేమంత్ ముదిరాజ్, బీజేపీ ఎల్లంపేట్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, జీఎస్లు మహేశ్, ప్రేమ్ దాస్
, వంశీ, విజయ్ పాల్గొన్నారు.
అలాగే మాజీ సర్పంచ్ విభూది యాదగిరి, ఈశ్వర్, సీనియర్ నాయకులు చింతల బాల్ రెడ్డి, మమ్మిండ్ల వెంకటేష్ యాదవ్, మాజీ సైనికులు చంద్రశేఖర్ రెడ్డి, బోర్వెల్స్ తిరుమలేశ్, పటేల్ సుధాకర్ గౌడ్, చెట్టి వెంకటేశ్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, దిలీప్ తదితరులు పాల్గొని రాఘవ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగింది.

