📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గౌడవల్లి, కండ్లకొయ్యలో ఘనంగా వినాయక పూజలు

గౌడవల్లి, కండ్లకొయ్యలో ఘనంగా వినాయక పూజలు

📰 Generate e-Paper Clip

గౌడవల్లి, కండ్లకొయ్యలో ఘనంగా వినాయక పూజలు

వినాయక మండపాలను సందర్శించిన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు గరిసెల సురేందర్ ముదిరాజ్

గుండ్లపోచంపల్లి: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌడవల్లి, కండ్లకొయ్య ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆయా యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను కాంగ్రెస్ పార్టీ గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ సందర్శించారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులతో కలిసి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపాల నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణ తీరును తెలుసుకున్నారు.

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న యూత్ అసోసియేషన్ సభ్యులను సురేందర్ ముదిరాజ్ అభినందించారు. యువత ఐక్యతతో ముందుకు సాగుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ అసోసియేషన్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.