మూలమలుపుల వద్ద చెట్లను తొలగించాలి
పొంచి ఉన్న ప్రమాదం… అధికారులు పట్టించుకోవాలి
మద్దూరు మండల ఏం ఆర్ పి ఎస్ అద్యక్షులుపాకాల ఇసాక్
మద్దూరు సెప్టెంబర్ 22, ప్రజా వాణి,
మద్దూర్ మండలంలోని పలు గ్రామాల పరిసర ప్రధాన రహదారుల్లో ఇరువైపులా ఏపుగా మూలమలుపుల వద్ద పెరిగిన చెట్ల కారణంగా వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎమ్మార్పీఎస్ మద్దూర్ మండల అధ్యక్షులు పాకాల ఇసాక్ అన్నారు.అధికారులు తక్షణమే స్పందించి మూలమలుపుల వద్ద ఉన్న చెట్లను తొలగించి, రహదారులను సురక్షిత రహదారులుగా మార్చాలని ఆయన కోరారు.అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఇసాక్ అధికారులను డిమాండ్ చేశారు. ఆయనతో పాటు నాయకులు గదేపాక కుమార్, ఎర్ర రాములు, వేల్పుల విజయ్ కుమార్, చిలుక రాంబాబు,రమేష్, కొండూరీ యాదగిరిలు ఉన్నారు.
