*యాదగిరిగుట్ట దేవస్థానంలో ఘనంగా లక్ష పూల అర్చన – హుండీ లెక్కింపులో పాల్గొన్న వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి):
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించిన లక్ష పూల అర్చన కార్యక్రమంలో మరియు హుండీ లెక్కింపు కార్యక్రమంలో వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన లక్ష పూల అర్చనలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, యాదగిరిగుట్ట ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
అనంతరం ఆలయంలో నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పరిశీలించారు. హుండీ లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చూడాలని, భక్తులు సమర్పించే కానుకలను సక్రమంగా లెక్కించాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
