📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆందోల్‌కు మరో భారీ అభివృద్ధి కానుక

ఆందోల్‌కు మరో భారీ అభివృద్ధి కానుక

📰 Generate e-Paper Clip

ఆందోల్‌కు మరో భారీ అభివృద్ధి కానుక

• ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.10 కోట్ల పరిపాలనా అనుమతి

జోగిపేట సెప్టెంబర్ 22 మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి

ఆందోల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవతో ఆందోల్–జోగిపేటలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతి లభించింది.
ఈ మేరకు జి .ఓ .ఆర్ టి .నం .282, తేదీ 21-09-2026 ద్వారా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. మంజూరైన నిధులను క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, అవసరమైన సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నారు.
ఈ అభివృద్ధితో ఆందోల్ నియోజకవర్గ యువతకు మెరుగైన క్రీడా అవకాశాలు, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.10 కోట్ల మంజూరు ఆందోల్ అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.