📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetబెజ్జంకి మండల కేంద్రంలో వార్డు సభ్యుల శిక్షణ ప్రారంభం

బెజ్జంకి మండల కేంద్రంలో వార్డు సభ్యుల శిక్షణ ప్రారంభం

📰 Generate e-Paper Clip

బెజ్జంకి మండల కేంద్రంలో వార్డు సభ్యుల శిక్షణ ప్రారంభం

ప్రజా సమస్యల పరిష్కారం, స్థానిక పాలనపై శిక్షణ

బెజ్జంకి, సెప్టెంబర్ 22 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో రెండో విడత వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది.ఈ శిక్షన కార్యక్రమం ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో వార్డు సభ్యులకు స్థానిక పాలన, గ్రామస్థాయి పరిపాలనపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ మాట్లాడుతూ వార్డు సభ్యులు తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం కావడం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.స్థానిక సంస్థల పరిపాలనలో వార్డు సభ్యుల పాత్ర, బాధ్యతలు, ప్రజలతో సమన్వయం, గ్రామాభివృద్ధి ప్రణాళికలు తదితర అంశాలను శిక్షణలో వివరించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు,వార్డు సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.