గతంలో వ్యాధులతో ప్రాణాలు పోయేవి, కానీ నేడు అధిక శబ్దంతో కూడిన డీజేల వల్ల గుండెసమస్యలతో ప్రాణాలు పోతున్నాయని, మన ఒక్క పూట ఆనందం కోసం కుటుంబంలో తీరని శోకం నింపకూడదని ధర్మపురి సీఐ రాం నరసింహారెడ్డి పేర్కొన్నారు. గణపతి నిమజ్జనంలో డీజేలను స్వచ్ఛందంగా నిషేధించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన కేసులు తప్పవని హెచ్చరించారు. మన ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ డీజేలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. డీజేలు వద్దు… ప్రాణాలు ముద్దు అని హితవు పలికారు.
డీజేలు వద్దు… ప్రాణాలు ముద్దు: ధర్మపురి సీఐ రాం నరసింహారెడ్డి
RELATED ARTICLES
