📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్*సార్ నోటీసులు అందుకున్న ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి మాజీ కౌన్సిలర్ సముద్రాల హంస కృష్ణ గౌడ్*

*సార్ నోటీసులు అందుకున్న ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి మాజీ కౌన్సిలర్ సముద్రాల హంస కృష్ణ గౌడ్*

📰 Generate e-Paper Clip

*సార్ నోటీసులు అందుకున్న ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి మాజీ కౌన్సిలర్ సముద్రాల హంస కృష్ణ గౌడ్*

*నోటీసు అందుకున్న ప్రతి ఓటరు సంబంధిత బిఎల్ఓ ను సంప్రదించి వివరాలు సమర్పించాలి*

మేడ్చల్, నేడు న్యూస్:- గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సార్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ సముద్రాల హంస కృష్ణ గౌడ్ సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవడంతో పాటు, నోటీసు అందుకున్న వారు సంబంధిత బూత్ లెవల్ అధికారి బిఎల్ఓను సంప్రదించి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.

సార్ ప్రక్రియలో భాగంగా బిఎల్ ఓ లు ఓటర్ల వివరాలను పరిశీలించడం, అవసరమైన సమాచారాన్ని సేకరించడం, ఓటరు జాబితాలో ఉన్న వివరాలను ధృవీకరించడం వంటి ప్రక్రియలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో ఓటరు అందుబాటులో లేకపోవడం, నివాసం మారడం, మరణం లేదా ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉండటం వంటి కారణాలతో కొన్ని పేర్లపై పరిశీలన జరుగుతుంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఇటువంటి వివరాలను పరిశీలించిన అనంతరం ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, అభ్యంతరాలు మరియు క్లెయిమ్‌లకు అవకాశం కల్పిస్తారు.

*నోటీసు అందుకున్న వారు ఏం చేయాలి?*

నోటీసు అందుకున్న ప్రతి ఓటరు ముందుగా తమకు కేటాయించిన బూత్ పరిధిలోని బిఎల్ o ను సంప్రదించాలని హంస కృష్ణ గౌడ్ సూచించారు. నోటీసులో పేర్కొన్న వివరాలను పరిశీలించి, అవసరమైన పత్రాలు లేదా సమాచారం ఉంటే బిఎల్ ఓ కు అందజేయాలని తెలిపారు. అలాగే, తమ పేరు ప్రస్తుత ఓటరు జాబితాలో ఉందో లేదో కూడా తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కోరారు.

ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో ఎన్నికల సంఘం ఓటర్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా కూడా పరిశీలించుకోవచ్చు. ఎన్నికల సంఘం ప్రకారం ఓటు వేయడానికి ఓటరు జాబితాలో పేరు ఉండటం తప్పనిసరి.

*వందల సంఖ్యలో నోటీసులు తిరిగి అందాల్సి ఉంది*

సార్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పలువురు ఓటర్లకు నోటీసులు అందించినప్పటికీ, వాటిని తిరిగి బిఎల్ ఓ
లకు అందించాల్సిన నోటీసులు ఇంకా వందల సంఖ్యలో ఉన్నాయని హంస కృష్ణ గౌడ్ తెలిపారు. నోటీసు అందుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంబంధిత బిఎల్ ఓ ను సంప్రదించి తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు.
ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కుకు సంబంధించిన ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని, ఎటువంటి సందేహాలు ఉన్నా సంబంధిత ఎన్నికల అధికారులను లేదా బిఎల్ ఓ లను సంప్రదించాలని ఆమె కోరారు.

*229వ డివిజన్‌లో నోటీసుల స్వీకరణ ప్రక్రియ*

ఈ క్రమంలో గుండ్లపోచంపల్లి 229వ డివిజన్ పరిధిలోని పలు బూత్‌లలో సార్ కు సంబంధించిన నోటీసులను స్వీకరించే ప్రక్రియలో సముద్రాల హంస కృష్ణ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న ఓటర్లతో మాట్లాడి, వారు తమ వివరాలను సంబంధిత బిఎల్ ఓలకు అందజేసేలా అవగాహన కల్పించారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తన పేరు సక్రమంగా నమోదై ఉందని నిర్ధారించుకోవడం ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఎవరైనా అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో లేకపోతే, నిబంధనల ప్రకారం క్లెయిమ్ దాఖలు చేసే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

*ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*

సార్ ప్రక్రియను ఓటర్లు నిర్లక్ష్యం చేయకుండా, తమకు అందిన నోటీసులను సంబంధిత అధికారులకు తిరిగి అందించి, అవసరమైన వివరాలను సమర్పించాలని హంస కృష్ణ గౌడ్ కోరారు. ప్రతి ఓటరు తన ఓటు హక్కును పరిరక్షించుకునే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.