📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadతొర్రూరు డివిజన్ కేంద్రంలో 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు రచనా పోటీలు

తొర్రూరు డివిజన్ కేంద్రంలో 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు రచనా పోటీలు

📰 Generate e-Paper Clip

 

కథలు, కవితలు, పద్యాలు, పాటలు, నాటికల విభాగాలలో పాల్గొనవచ్చును.

తెలంగాణ ప్రభుత్వ సాహిత్య అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహణ.
రచనలు పంపడానికి ఆఖరు తేదీ 30-09-2026.
బాలల దినోత్సవం, నవంబర్ 14, 2026 సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ వారి ఆధ్వర్యంలో ప్రస్తుతం 6 నుండి 10వ తరగతి చదువుతున్న అన్ని రకాల పాఠశాలల విద్యార్థులకు వారి వారి పాఠశాలల్లోనే, వారి వారి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో రచనా పోటీలు నిర్వహించాలని ఆ సంస్థ కార్యదర్శి డా. బాలాచారి నమోజు ఒక ప్రకటన విడుదల చేశారని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొనికెన కుమారస్వామి తెలిపారు.
తొర్రూరు డివిజన్ కేంద్రంలో సోమవారం నాడు దొనికెన మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రకటన ప్రకారంగా తెలంగాణ ప్రాంత సంస్కృతి, జనజీవన విధానం, చారిత్రక వ్యక్తులు, భాష మొదలగు అంశాలలో కథలు, కవితలు, పద్యాలు, పాటలు, నాటికల విభాగాలలో రాసిన రచనలను మాత్రమే ఈ పోటీలో స్వీకరింపబడతాయని దొనికెన చెప్పారు.
సంబంధిత ప్రకటనను అనుసరించి తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుని చేత ధృవీకరించిన పత్రాన్ని జతచేసి ఒక్కో విద్యార్థి 5 పద్యాల వరకు పద్య రచనలు, 26 పంక్తులకు మించని కవిత్వ రచనలు, ఏ4 సైజులో మూడు పుటలకు మించని కథలు, నాటికలు ఏ విభాగంలో పంపుతున్నారో వివరంగా తెలియజేయాలని, రచనలపై విద్యార్థి పేరు, పాఠశాల పేరు లాంటి ఎటువంటి సమాచారం ఉండకూడదని, హామీ పత్రం లేని రచనలు తిరస్కరింపబడతాయని దొనికెన తెలిపారు.
విద్యార్థి ఫోటోతో పాటు పూర్తి పేరు, తల్లిదండ్రుల పేర్లు, చదువుతున్న పాఠశాల పేరు, తరగతి, ఫోన్ నెంబర్, పూర్తి అడ్రస్ మొదలైన వివరాలు గల పత్రాన్ని విడిగా తప్పనిసరి జతచేసి, ఆఖరు తేదీ 30-09-2026 లోగా తమ రచనలను “కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాభవన్, రవీంద్ర భారతి ప్రాంగణం, హైదరాబాద్-500004” అనే అడ్రస్ కు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపాలని, ఇతర మార్గాల్లో పంపినవి స్వీకరింపబడవని, వివరాలకు ఫోన్ నెంబర్లు 9182445692, 9014445692 లలో సంప్రదించవచ్చని దొనికెన వివరించారు.
ఫలితాల నిర్ణయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ వారిదే తుది నిర్ణయం అయినందున ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు అవకాశం లేదని, ఆఖరు తేదీకి ఒక వారం అటుఇటుగా కూడా తమ రచనలను పంపే అవకాశం ఉంటున్నందున రాష్ట్రంలోని పాఠశాలలు, తల్లిదండ్రులు, విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కుమారస్వామి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.