చిట్రెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
ఎదురెదురుగా ఢీకొన్న రెండు ద్విచక్ర వాహనాలు
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
మన ప్రజావాణి
చౌడేపల్లి:
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం పలమనేరు ప్రధాన రహదారిలోని చిట్రెడ్డిపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో చౌడేపల్లి కుమ్మరవీధికి చెందిన మహేష్ (వెంకటరమణ కుమారుడు), గంగాభవాని కురపల్లికి చెందిన డి.సంతోష్ ఉన్నట్లు సమాచారం. గాయపడిన ఇద్దరిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

