ఎర్రగట్టుగుట్టలో భక్తి వెల్లువ.. కిట్స్ కళాశాలలో మహా అన్నదానం!
వినాయకుడి సన్నిధిలో ఘనంగా అన్నప్రసాద వితరణ
ఎలుగు జితిన్, శ్వేత ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం
సేవాభావంతో పాల్గొన్న విద్యార్థులు, భక్తులు
హసన్పర్తి–భీమారం, ప్రజావాణి:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట–భీమారం పరిధిలోని కిట్స్ కళాశాలలో వినాయకుడి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఎలుగు జితిన్, శ్వేత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా అయ్యగారు, వేదాంతం పార్థసారథి చారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణలో భాగస్వాములయ్యారు. వినాయకుడిని దర్శించుకున్న అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.
కళాశాల విద్యార్థులు, సిబ్బంది, భక్తులు సేవా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తూ సేవాభావాన్ని చాటిన, జితిన్, శ్వేతలను పలువురు అభినందించారు.
హసన్పర్తి–భీమారం ఎర్రగట్టుగుట్టలోని కిట్స్ కళాశాలలో వినాయకుడి సన్నిధిలో భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తున్న ఎలుగు జితిన్, శ్వేత, ప్రముఖులు.

