📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalచీకటి తెరలు తొలిగాయి.. 54 మంది జీవితాల్లో కొత్త కాంతులు!

చీకటి తెరలు తొలిగాయి.. 54 మంది జీవితాల్లో కొత్త కాంతులు!

📰 Generate e-Paper Clip

చీకటి తెరలు తొలిగాయి.. 54 మంది జీవితాల్లో కొత్త కాంతులు!

పేదరికాన్ని జయించిన చూపు.. జనతా ట్రస్ట్ ఉచిత వైద్య యజ్ఞం విజయవంతం 

శంకరపౌండేషన్, కాంచి కామకోటి సంస్థల సాంకేతిక సహాయం

 

600 మందికి పరీక్షలు.. 54 మందికి హైదరాబాద్ లో కార్పొరేట్ స్థాయి శస్త్రచికిత్సలు

డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డికి తడిసిన కళ్ళతో బాధితుల కృతజ్ఞతలు 

చెన్నారావుపేట సెప్టెంబర్ 18 ప్రజావాణి

ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, పెరిగిపోతున్న వయసు మరోవైపు.. వెరసి ఏళ్ల తడబడి చూపు మసకబారి, నాలుగు గోడలకే పరిమితమైన ఆ వృద్ధుల జీవితాల్లో శుక్రవారం కొత్త వెలుగులు వికసించాయి.చెన్నారావుపేట మండల వ్యాప్తంగా జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో, శంకర ఐ ఫౌండేషన్ ఇండియా మరియు శ్రీ కాంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం వందలాది నిరుపేద కుటుంబాల్లో ఆశల దీపాలు వెలిగించింది.

కార్పొరేట్ వైద్యం.. ఉచితంగా గ్రామీణులకు! 

ఇటీవల నిర్వహించిన ఈ భారీ వైద్య శిబిరానికి మండల నలుమూలల నుంచి సుమారు 600 మందికి పైగా బాధితులు తరలివచ్చారు. అనుభవజ్ఞులైన వైద్య బృందం ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరీక్షించి, తీవ్రమైన మోతీయాబిందు (క్యాటరాక్ట్) సమస్యతో తక్షణ ఆపరేషన్ అవసరమైన 54 మందిని గుర్తించింది. రూపాయి ఖర్చు లేకుండా, లబ్ధిదారులను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ లోని అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ లేజర్ సాంకేతికతతో విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తిచేసి, తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఆపరేషన్ ముగించుకుని, పూర్తి కంటి చూపుతో స్వగ్రామం చేరుకున్న లబ్ధిదారులకు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోలేక ఇన్నాళ్లు చీకట్లోనే బతికాం. జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి దేవుడిలా వచ్చి ఉచితంగా చూపు తెప్పించారు. ఆయనకు మా కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటాయి అంటూ భావోద్వేగానికి గురై కన్నింటి పర్యంతమయ్యారు. లాబాపేక్ష లేని సేవ తమ నైజమని ప్రజల ఆరోగ్య పరిరక్షనే ప్రాథమిక బాధ్యతగా భావించి భవిష్యత్తులో చెన్నారావుపేట మండలంలో మరిన్ని సామాజిక వైద్య కార్యక్రమాలను విస్తృతం చేస్తామని జనతా ట్రస్ట్ నిర్వాహకులు సృష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.