డి జె నిర్వహణదారుల ముందస్తు బైండోవర్
నిబంధనలు అతిక్రమిస్తే లక్ష రూపాయలు జరిమానా
మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్
మద్దూరు సెప్టెంబర్ 18, ప్రజా వాణి,
గణేష్ నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా శుక్రవారం మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దూర్ మరియు దూల్మిట్ట మండలాలకు చెందిన డీజే నిర్వహణదారులను సంబంధిత మద్దూర్,దూల్మిట్ట,ఏ. జి రహీమ్,శ్యామ్, తహశీల్దార్ల ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే లక్ష రూపాయలు జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు.

