📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonహమార ప్రసాద్ కు చెప్పుల దండ వేసి దిష్టిబొమ్మ దహనం

హమార ప్రసాద్ కు చెప్పుల దండ వేసి దిష్టిబొమ్మ దహనం

📰 Generate e-Paper Clip

హమార ప్రసాద్ కు చెప్పుల దండ వేసి దిష్టిబొమ్మ దహనం

రాజ్యద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలి శిక్షించాలి – డా జేరిపోతుల పరశురామ్
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18(ప్రజవాణి):
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పిత నాయకుడు అని హమారా ప్రసాద్ ఒక పుస్తకాన్ని రాశాను దానిని విడుదల చేస్తానాని సోషల్ మీడియాలో మాట్లాడుతున్న హమార ప్రసాద్ పై రాజ్య ద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరుశురామ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు
కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హమారా ప్రసాద్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి జనగామ చౌరస్తా లో ర్యాలీ నిర్వహించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేసిహమారా ప్రసాద్ కు చెప్పులతో దేహశుద్ధి చేసి దిష్టిబొమ్మ దహనం చేసారు.
ఈ సందర్భంగా డాక్టర్ జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ గతంలో కూడా హమారా ప్రసాద్ డా బి ఆర్ అంబేద్కర్ బ్రతికి ఉంటే ఎన్కౌంటర్ చేసేవాడిని , అంబేద్కర్ విగ్రహాలను చూస్తుంటే అసహ్యం వేస్తుందని, ఎందుకు విగ్రహాలు పెడుతున్నారో వాటిని కూలగొట్టేలా మాట్లాడుతూ భారత రాజ్యాంగం వ్రాసింది డా బి అంబేద్కర్ అని చరిత్ర చెప్తుంటే తన సొంత కవిత్వంతో ప్రజలను తప్పుదోవ పట్టించే హమారా ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుస్తకం ఎలా విడుదల చేస్తారో దాని అడ్డుకుంటాం లేనిచో ప్రజల చేత దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు.
దళిత బహుజన అంబేద్కర్ సంఘాలు పౌర సమాజం మేల్కొని ఇలాంటి దేశ విద్రోశక్తులను తరిమి కొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని “అబద్ధం కూడా ప్రచారంలో ఉంటే అది నిజమే అవుతుందని ఆనాడు అంబేద్కర్ అన్నాడు” అబద్ధము రాతలు రాస్తున్న హమారా ప్రసాదను దేహశుద్ధి చేయాల్సిందేనని అన్నారు
ఈ కార్యక్రమంలో కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ సలహాదారులు మల్లిగారి రాజు, మచ్చ కుమార్ బక్క సునీల్, తాళ్లపల్లి ఎల్లేష్, రొడ్డ కృష్ణ గండి చంద్రశేఖర్, దాసరి సతీష్, ఆడెపు రమేష్, గంగారబోయిన మౌనిక, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.