*విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్*
*జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతార్*
*తహసీల్దార్ చెప్పిన లెక్క చేయని రెవిన్యూ ఇన్స్పెక్టర్*
ప్రజావాణి/నేరేడుచర్ల, సెప్టెంబర్ 17.
నేరేడుచర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ శోభారాణి నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నరసయ్య గూడెం ప్రాథమిక పాఠశాలకు దారి ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు వెళ్లే దారిని కొంతమంది రైతులు మూసివేసిన విషయము జిల్లా కలెక్టర్, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు పాఠశాలకు దారి ఏర్పాటు చేయాలని కలెక్టర్ తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను ఆమె ఖాతరు చేయకుండా ఈ విషయం అడిగిన గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తిస్తుందని గ్రామస్తులు ఆరోపించారు. పాఠశాలకు దారి మూసి వేయటంతో అందులో నడుస్తున్న కేంద్రాన్ని అంగన్వాడి టీచర్ సొంత ఇంట్లో నిర్వహిస్తూ అద్దెను తీసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. అంగన్వాడి కేంద్రాన్ని ప్రాథమిక పాఠశాల భవనములోమౌయి నిర్వహించకపోవడం వల్ల పాఠశాల నిరుపయోగంగా ఉండటంవల్ల దారిని కొంతమంది రైతులు మూసివేశారని గ్రామస్తులు పేర్కొన్నారు. మళ్లీ అంగన్వాడి కేంద్రానికి కొత్త భవనం నిర్మించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థల దాత కొప్పు భిక్ష్మయ్య ఎనిమిది కుంటల భూమిని ఇచ్చిన స్థలములో ప్రాథమిక పాఠశాల భవనమును గతంలో నిర్మించారు. ప్రస్తుతం దారి లేని కారణంగా పాఠశాల భవనము శిథిలావస్థలో ఉంది. ప్రాథమిక పాఠశాలకు దారి ఏర్పాటు చేసి పునర్ వైభవము తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.ఇట్టి విషయమై స్కూల్ కి దారి చూపించాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆదేశాలు వున్నా అట్టి ఆదేశాలను లెక్క చేయకుండా తను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్న రెవిన్యూ ఇన్స్పెక్టర్ తహసీల్దార్ ఆదేశాలను సైతం పక్కన పెట్టిన అధికారిని. స్కూల్ దారిని చేపడితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది దారి లేక ప్రజా ధనం తో నిర్మించిన భవనం నిర్వీర్యం అవుతున్నది. భవనం వాడుకలో లేక సిదిలా వ్యవస్తకు దారితిస్తుంది కాబట్టి దారి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న మండల ఆర్ ఐ పై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చట్ట పరమైన చర్యలు తిసుకోవాలని గ్రామస్థులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
*ఆర్ ఐ శోభ రాణి వివరణ:*
ఈ విషయమై మండల ఆర్ఐ శోభారాణిని వివరణ కోరగా పాఠశాలకు దారి చూపించే విషయంలో సoత్సరం టైం పడుతుంది నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను , తీరిక ఉన్నప్పుడు వచ్చి దారి ఏర్పాటు చేస్తానని అన్నారు.

