📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవినాయక మండపాన్ని సందర్శించిన బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి

వినాయక మండపాన్ని సందర్శించిన బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి

📰 Generate e-Paper Clip

వినాయక మండపాన్ని సందర్శించిన బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి

బెజ్జంకి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామ ముదిరాజ్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి, దాచారం సర్పంచ్ బైరా మానస రాజేందర్ సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.అనంతరం మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై తోట తిరుపతి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.ప్రజలందరూ సోదరభావంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ముదిరాజ్ కాలనీ యువకులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.