📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ

ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ

📰 Generate e-Paper Clip

ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ

పెద్దవంగర, సెప్టెంబర్ 17 ప్రజావాణి
ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దవంగర మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రం (ఎం.ఆర్.సి ) లో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి బి. శ్రీనివాస్ పథకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్దవంగర సర్పంచ్ పారిజాత సురేష్ పాల్గొని ప్రజా పాలన, విద్యాభివృద్ధి మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎం ఈ ఓ బి. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సమర్థవంతంగా అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యా రంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని సూచించారు.ప్రజా పాలన యొక్క ప్రధాన లక్ష్యం ప్రజల అవసరాలను గుర్తించి, వారికి ప్రభుత్వ సేవలు మరియు సంక్షేమ పథకాలను చేరువ చేయడమేనని, ఈ దిశగా అధికారులు, ఉపాధ్యాయులు మరియు ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, సి ఆర్ పి , ఉపాధ్యాయులు, ఎం ఆర్ సి సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.