📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaస్వచ్ఛతలో బస్వాపూర్‌ సంచలన ముందడుగు

స్వచ్ఛతలో బస్వాపూర్‌ సంచలన ముందడుగు

📰 Generate e-Paper Clip

స్వచ్ఛతలో బస్వాపూర్‌ సంచలన ముందడుగు

జిల్లాలోనే తొలిసారిగా ఇంటింటికీ నాలుగు చెత్తబుట్టల పంపిణీ

తంగళ్ళపల్లి ప్రజావాణి సెప్టెంబర్ 17 బస్వాపూర్‌ గ్రామ స్వచ్ఛత లో,చెత్త నిర్వహణలో వినూత్న ముందడుగు వేసింది. జిల్లాలోనే తొలిసారిగా ప్రతి ఇంటికీ నాలుగు చొప్పున చెత్తబుట్టలను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్పంచ్‌, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి చొరవతో అధికారులు గ్రామస్థులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ–2026 విధానంలో భాగంగా ఇంటి వద్దే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని అధికారులు సూచించారు. వేరు చేసిన చెత్తను మాత్రమే సిబ్బంది సేకరిస్తారని, నిబంధనలు పాటించని వారికి జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చెత్తను మూలస్థాయిలోనే వేరు చేయడం ద్వారా గ్రామ పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతుందని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డీపీఓ, డీఆర్‌డీఓ, ఎంపీడీఓ, ఎంపీవో, ఉపసర్పంచ్‌ అనిల్‌, ప్రవీణ్‌, రాజు, ప్రశాంత్‌, భవాని, నవీన్‌, రమ్య, రాజు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.