గుండ్లపోచంపల్లిలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి
మేడ్చల్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గుండ్లపోచంపల్లి బీజేపీ డివిజన్ అధ్యక్షులు కావేరి శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. నైజాం పాలన, రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి కోసం సాగిన పోరాటాన్ని, సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ను ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షోయబుల్లా ఖాన్, కొమురం భీమ్ తదితర మహనీయులతో పాటు వేలాది మంది అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. వారి పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దేశ ఐక్యత, అభివృద్ధి, రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాక్స్ మాజీ చైర్మన్ జైతువాల కిషన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతలపూడి రామారావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు బట్టికాడి నవనీత, బీజేపీ నాయకులు చెంచాల సురేష్ ముదిరాజ్, సుంకు నవీన్, ప్రవీణ్ గౌడ్, వడ్డే నరసింహ తదితరులు పాల్గొన్నారు.

