📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రవి ఆకస్మిక తనిఖీ

ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రవి ఆకస్మిక తనిఖీ

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రవి ఆకస్మిక తనిఖీ

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అదనపు కలెక్టర్ రవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి,అక్కడ నిర్వహిస్తున్న ఫైళ్లను తనిఖీ చేశారు.
పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు,కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై అదనపు కలెక్టర్ రవి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు,దస్త్రాలను పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించినట్లు సమాచారం విధి నిర్వహణలో తహసీల్దార్ ప్రసాద్ రావు,డిప్యూటీ తహశీల్దార్ రమేష్,కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.