భూభారతి-భూ సర్వే పై అవగాహనా కల్పిస్తున్న ట్రైని డిప్యూటీ కలెక్టర్
దమ్మపేట,ప్రజావాణి న్యూస్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పరిధిలోని వడ్లగూడెం గ్రామంలో భూ భారతి సర్వేపై వడ్లగూడెం భూ హక్కు దారులకు, రైతులకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మురళి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భూ హక్కుదారులకు భూ సమస్యలపై నేరుగా వారితో మాట్లాడించి తమ సందేహాలను నిర్వర్తి చేయడం జరిగింది. అదేవిధంగా భూ సర్వే కి వచ్చినప్పుడు భూమి హద్దులు కొలిచే కార్యక్రమం లో హక్కుదారులు అందరు సహకరించగలరని కోరారు. భూమి ఏ కారణం చేత అయిన కోల్పోయిన నిజమయిన హక్కు దారులకు సర్వే లో పేరు ఉంటే పరిశీలించి అన్ని ఆధారాలు నిజమే అని తెలితే ఆ హక్కు దారులకు భూమి వచ్చే విధంగా చూస్తాం అని అన్నారు. రైతులతో నేరుగా మాట్లాడించి సమస్యలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు మెంబర్లు,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు

