విషాదం … వ్యక్తి అకాల మరణం
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి మాట్లాడుతూ కస్తాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు శివరాత్రి వెంకటేశం సోమవారం వరంగల్ పోయి వస్తుండగా స్టేషన్ ఘనపూర్ వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొని తుది శ్వాస వినడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణంగా భావించి తన జీవితకాలంలో అత్యధికంగా గాంధీభవన్ లో కాలం గడిపి కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారాధులకు డాక్టర్ గా సుపరిచితులై గాంధీభవన్లో మంచి పేరు తెచ్చుకున్న శివరాత్రి వెంకటేశం అకాల మరణానికి చింతిస్తూ మంగళవారం ఉదయం వారి భౌతిక కాయాని కస్తాల గ్రామంలో పూలమాలవేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయుటకు చండూరు మండలంలోని ప్రజాప్రతినిధులు వివిధ హోదాలో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు కస్తాల గ్రామానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.

