📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్పోరుమామిళ్లలో చక్రం తిప్పుతున్న లిక్కర్ డాన్లు.. ఆగని దందా!

పోరుమామిళ్లలో చక్రం తిప్పుతున్న లిక్కర్ డాన్లు.. ఆగని దందా!

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్లలో చక్రం తిప్పుతున్న లిక్కర్ డాన్లు.. ఆగని దందా!

 

 

పోరుమామిళ్ల మండలంలో లిక్కర్ దందాపై ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

మద్యం విక్రయాల్లో కొందరు సిండికేట్‌గా ఏర్పడి.. ఎమ్మార్పీ ధరలకు పాతర వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా వినాయక చవితి పండుగను టార్గెట్‌గా చేసుకుని.. క్వార్టర్ బాటిల్‌పై పది నుంచి ఇరవై రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారంటూ పలువురు మందుబాబులు ఆరోపిస్తున్నారు.

ఇది ఒక్కో బాటిల్‌పై చిన్న మొత్తం అనిపించినా.. రోజుకు వందలు, వేల బాటిళ్లు విక్రయిస్తే సామాన్యుడి జేబుపై పడే భారం ఎంత ఉంటుందో అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.రోజువారీ కూలీలు, పేద, సామాన్య కుటుంబాలకు చెందిన ప్రజలు.. పండుగ సమయంలో కూడా ఈ అదనపు ధరల భారాన్ని భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంత బహిరంగంగా ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా.. సంబంధిత అధికారులు ఎందుకు కఠినంగా స్పందించడం లేదనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

లిక్కర్ దందాపై ప్రజా సంఘాలు, మీడియా ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పటికీ.. కొందరు అధికారులు, ఒక వర్గం మీడియా సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.అధికారులు నిజంగా తనిఖీలు చేస్తున్నారా?ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్న షాపులపై కేసులు నమోదు చేస్తున్నారా?లేక ఫిర్యాదులు వచ్చినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా?ఇదే ఇప్పుడు పోరుమామిళ్ల ప్రజలు అడుగుతున్న ప్రశ్న.ఈ పరిస్థితి ఇక్కడితో ఆగకపోతే.. ప్రక్క మండలాలకు, జిల్లాలకు, చివరకు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అక్రమ వసూళ్లకు ఊతం లభించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ ఒక విషయం ప్రభుత్వం కూడా గమనించాలి.ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మంచి పేరు వస్తున్న సమయంలో.. ఇలాంటి లిక్కర్ అక్రమ వసూళ్ల ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టకు ఇబ్బందిగా మారకూడదు.అందుకే జిల్లా అధికారులు ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి.ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు నిజమని తేలితే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.ముఖ్యంగా పండుగల సమయంలో సామాన్య ప్రజలను దోచుకునే పరిస్థితి రాకుండా ఎక్సైజ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి.ప్రభుత్వానికి కూడా ప్రజల తరఫున ఒక సూచన..లిక్కర్ అక్రమ వసూళ్ల ఆరోపణలను చిన్న విషయంగా తీసుకోకుండా.. మూలాలను గుర్తించి కట్టడి చేయాలి.లేకపోతే ఈ దందా మరింత విస్తరించి.. చివరకు ప్రభుత్వానికే చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది.అధికారులూ.. ఇప్పటికైనా మేల్కొనండి.లిక్కర్ దందాపై వస్తున్న ఆరోపణలపై నిజానిజాలు తేల్చి.. ప్రజలకు సమాధానం చెప్పండి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.