దూలిమిట్ట మండల ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి
మద్దూరు సెప్టెంబర్13, ప్రజా వాణి,
దూల్మిట్ట మండల ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం(ఎల్ ఎఫ్ ఎల్-హెచ్ ఏం ఎస్)మండల అధ్యక్షులుగా పన్యాల శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తేదీ 11 సెప్టెంబర్ 2026 రోజున మండల కేంద్రంలో జరిగిన ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దొంతుల సత్యానందం,మరియు ప్రధాన అధ్యక్షులు వెంకటయ్య పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల బలోపేతానికి మరియు ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.పాఠశాలల విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
