📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక చాకలి ఐలమ్మ

ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక చాకలి ఐలమ్మ

📰 Generate e-Paper Clip

ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక చాకలి ఐలమ్మ

 

ఘనంగా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి

 

పెద్దవంగర సెప్టెంబర్ 10 ప్రజావాణి

 

పెద్దవంగర మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ దొరల దౌర్జన్యాలు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారని కొనియాడారు. ఆమె ధైర్యం, తెగువ, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంగు మురళి, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ముద్దసాని సురేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు సంకపల్లి రవీందర్ రెడ్డి, అనపురం వినోద్ గౌడ్, దాసరి శ్రీను,శోభన్, వెంకన్న సిరి శ్రీనివాస్, కొండ్రతి శ్రీనాథ్, కొండ్రతి కొమరమల్లు వెంకటేష్, లింగమూర్తి, రాములు, రజక సంఘం కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రజక సోదరులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.